అమెరికాలో ప్రారంభం కానున్న అనుష్క సినిమా
అనుష్క నటించే కొత్త చిత్రానికి ముహూర్తం కుదిరింది. మాధవన్, అంజలి, షాలిని పాండేతో కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంయుక్తంగా బహుభాషల్లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తెలుగు, తమిళ, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో నిర్మాణం అవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమని చిత్రబృందం తెలిపింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్, గోపి సుందర్, షనీల్డియో, గోపి మోహన్, నీరజ కోన సాంకేతిక నిపుణులు. మార్చి నెలలో ఈ చిత్రం షూటింగ్ అమెరికాలో ప్రారంభిస్తామని, ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాన సంస్థ అధినేతలు టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ తెలిపారు.













