Mad3: సైలెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన మ్యాడ్3

నార్నే నితిన్(narne nithin), సంగీత్ శోభన్(sangeeth sobhan), రామ్ నితిన్(ram Nithin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్(MAD). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా మంచి వసూళ్లను కూడా అందుకుని నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్వ్కేర్(Mad2) ను తీశారు మేకర్స్. మ్యాడ్ స్వ్కేర్ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది.
మ్యాడ్ స్వ్కేర్ కు మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అందుకుని లాభాలను తెచ్చిపెట్టింది. అయితే మ్యాడ్2 క్లైమాక్స్ లో దానికి సీక్వెల్ గా మ్యాడ్3(Mad3) ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా మ్యూడ్ 3 గురించి మ్యాడ్ ఫ్రాంచైజ్ లో కీలక పాత్రలో నటించిన విష్ణు ఓయి(Vishnu Oi) ఓ అప్డేట్ ను అందించాడు.
మ్యాడ్3 సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని, త్వరలోనే దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ను మేకర్స్ సోషల్ మీడియాలో ఇవ్వనున్నారని చెప్పాడు. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా మ్యాడ్ 3 రూపొందుతుందని అంటున్నారు. వార్2(war2) డిస్ట్రిబ్యూషన్ తో తన నమ్మకాన్ని కోల్పోయిన నాగ వంశీ(naga vamsi) ఈసారి సైలెంట్ గా పని కానిచ్చి, రిజల్ట్ తో అందరికీ సమాధానం చెప్పాలనుకుంటున్నట్టు ఉన్నాడు. అందుకే మ్యాడ్3 గురించి ఎలాంటి అప్డేట్ లేకుండా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.