Mad Square: మ్యాడ్ స్వ్కేర్ కు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల గుడ్న్యూస్
ఈ మధ్య బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతీ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలకు లేఖలు రాస్తున్నాయి. ఈ వారం రిలీజవుతున్న మ్యాడ్ స్వ్కేర్(Mad Square) సినిమాకు ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు వెసులుబాటు కల్పించింది. కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో నార్నే నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), రామ్ నితిన్(Ram Nithin) హీరోలుగా వస్తోన్న మూవీ మ్యాడ్ స్వ్కేర్.
సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) నిర్మించిన ఈ మూవీకి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మ్యాడ్ స్వ్కేర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిలిచ్చాయి. రేట్లు పెరిగాక ఏపీలో సింగిల్ స్క్రీన్ టికెట్ రేటు రూ.197.5 కాగా, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.252 అయింది.
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.175 కాగా, మల్టీప్లెక్సుల్లో టికెట్ రేటు రూ.295 రూపాయలైంది. ఇప్పటికే ఈ మూవీపై మంచి బజ్ నెలకొనడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సుంది. దానికి తోడు ఇప్పుడు టికెట్ రేట్లు కూడా పెరగడంతో మొదటి రోజు మ్యాడ్ స్వ్కేర్ కు అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కడం ఖాయం.













