దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్..
ఈసారి దీపావళికి థియేటర్లో విడుదలైన ప్రతి సినిమా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. వీటిలో ఒకటి దుల్కర్ సల్మాన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ సినిమాటోగ్రఫీ, నిర్మాణ నాణ్యత విషయంలో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అక్టోబర్ 31న తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మిగిలిన భాషల్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల పై సరికొత్త కోణంలో సాగే ఈ కథ ఓ వర్గాన్ని బాగా ఆకట్టుకుంది. తొలిరోజే ఈ చిత్రం 12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేస్తుంది.
చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమాలు అద్భుతమైన సక్సెస్ లు సాధించడం ఈ మధ్యకాలం బాగా కామన్ అయింది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.111కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. మహానటి, సీతారామం చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ కు లక్కీ భాస్కర్ ద్వారా తెలుగులో హ్యాట్రిక్ విజయాలు సొంతమయ్యాయి. ఈ మూవీ సక్సెస్ తర్వాత చిన్న బడ్జెట్ నిర్మాతలకు టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ ఓ మంచి ఆప్షన్ గా మారిపోయాడు.
ఇక ఆ విషయాలు పక్కన పెడితే ఈ మూవీకి సంబంధించిన ఆన్లైన్ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకుంది. సక్సెస్ఫుల్ థియారిటికల్ రన్ పూర్తయిన సందర్భంగా ఈ మూవీ ఈనెల చివరికి ఓటీటీ లోకి రాబోతోంది. సమాచారం ప్రకారం నవంబర్ 30 నుంచి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.













