Lucky Baskhar: భాస్కర్ నిజంగా లక్కీనే!
ఈ రోజుల్లో సినిమా ఎంత హిట్ టాక్ తెచ్చుకున్నా రెండు వారాలకు మించి సినిమా స్ట్రాంగ్ గా ఆడటం లేదు. ఈ లోపు నిర్మాతలు కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు చూస్తున్నారు. అలాంటిది సినిమా ఓటీటీలోకి వచ్చాక కూడా లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమాకు టికెట్స్ కొని మరీ ఆడియన్స్ బిగ్ స్క్రీన్ పై దుల్కర్(Dulquer Salman) బ్యాంక్ క్రైమ్ స్కామ్ ను చూస్తున్నారు.
రెండ్రోజుల ముందే లక్కీ భాస్కర్ నెట్‌ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ కు వచ్చింది. రిలీజ్ టైమ్ లో మిస్సయిన వారంతా ఇప్పుడు సినిమాను చూసి మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఇప్పటికీ బుక్ మై షో(Book My Show) లో గత 24 గంటల్లో లక్కీ భాస్కర్ కు 7 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
దీన్ని బట్టి కంటెంట్ కనెక్ట్ అయితే టాలీవుడ్ ఆడియన్స్ థియేటర్లోనే సినిమా చూడ్డానికి ఇష్టపడతారని తెలిసిపోతుంది. సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ(Naga Vamsi) చెప్పినట్లుగానే లక్కీ భాస్కర్ లాంగ్ రన్ లో దూసుకెళ్తుంది. మెయిన్ థియేటర్లలో ఇప్పటికీ ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఓటీటీలో కూడా లక్కీ భాస్కర్‌కు మంచి వ్యూస్ వస్తున్నాయి.













