రూ.100 కోట్ల క్లబ్ లోకి లక్కీ భాస్కర్
టాలీవుడ్ లో మొన్న దీపావళికి రిలీజైన సినిమాలు లక్కీ భాస్కర్(Lucky Baskhar), క(KA), అమరన్(Amaran) కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడు సినిమాలూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. మొదట్లో క, అమరన్ సినిమాలే ఎక్కువ కలెక్షన్స్ సాధించగా, లక్కీ భాస్కర్ కాస్త వెనుక బడినట్లు అనిపించింది. వాస్తవానికి ఈ మూడు సినిమాల్లో యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది లక్కీ భాస్కర్ సినిమాకే.
కాకపోతే లక్కీ భాస్కర్ బ్యాంక్ మోసాల కాన్సెప్ట్ కావడంతో అందరికీ అర్థం కాకపోవడం వల్ల మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా ఎక్కువ రీచ్ అవలేదు. కానీ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో లక్కీ భాస్కర్ మూడో వారంలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తమిళ, మలయాళంలో లక్కీ భాస్కర్ కొత్త సినిమాలానే రన్ అవుతోంది.
మలయాళంలో అయితే బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. మూడు భాషల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.40 కోట్లు, మలయాళం రూ.20 కోట్లు, తమిళంలో రూ.10 కోట్లు కలెక్ట్ చేసిన లక్కీభాస్కర్ కర్ణాటక మరియు ఓవర్సీస్ లో బాగా ఆడుతుంది. లక్కీ భాస్కర్ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద సక్సెస్.













