Lucky Baskhar: పాన్ ఇండియా సినిమాలను దాటేసిన లక్కీ భాస్కర్
బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించిన సినిమాలు కూడా కొన్నిసార్లు ఓటీటీలోకి వచ్చాక ఆశించిన ఫలితాలు అందుకోలేవు. కల్కి(Kalki) సినిమా రూ.1000 కోట్లు సాధించినా డిజిటల్ లో మాత్రం వండర్స్ చేయలేకపోయింది. కానీ దుల్కర్ సల్మాన్(Dulquer)- వెంకీ అట్లూరి(Venky Atluri) కాంబినేషన్ లో వచ్చిన లక్కీ భాస్కర్(Lucky Baskhar) మాత్రం బాక్సాఫీస్ దగ్గర లానే నెట్ఫ్లిక్స్(Netflix) లో కూడా దూసుకెళ్తుంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చి మూవు వారాలవుతుంది. ఇప్పటివరకు లక్కీ భాస్కర్ 14.9 మిలియన్ వ్యూస్ సాధించింది. సెకండ్ వీక్ లోనే దేవర(Devara)ను మూడో స్థానానికి నెట్టేసి సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం చూసిన సినిమాగా కొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ ఉన్న వాటిలో మహారాజా 19.7 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉండగా నెక్ట్స్ ప్లేస్ దక్కించుకుంది లక్కీ భాస్కరే.
దేవర 9 మిలియన్ వ్యూస్ తో కొనసాగుతుండగా, కల్కి హిందీ 8 మిలియన్లు, ఇండియన్2(Indian2) 6.8 మిలియన్లతో ఉన్నాయి. వీటన్నింటినీ బట్టి పాన్ ఇండియా సినిమాల కంటే ఎక్కువ ఆదరణ లక్కీ భాస్కర్ సినిమానే దక్కించుకోవడం విశేషం. దీంతో దుల్కర్ నటించిన ఇంతకు ముందు సినిమాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇవన్నీ వెంకీ అట్లూరి, దుల్కర్ బ్రాండ్ ను మరింత పెంచుతున్నాయి.













