లవ్ మి ఆ ఛాన్స్ ను ఎంతవరకు ఉపయోగించుకుంటుందో
ఈ శుక్రవారం రిలీజైన సినిమాలు థియేటర్లను తిరిగి కళకళలాడేలా చేస్తాయనుకుంటే నిరాశ పరిచాయి. శుక్రవారం రిలీజైన రాజు యాదవ్ సినిమాను ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు. కానీ తర్వాత రోజు మాత్రం థియేటర్లలో సందడి కనిపించింది. అదే రోజున దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లవ్ మి సినిమా ఆడియన్స్ ను కాస్త ఎట్రాక్ట్ చేయగలిగింది.
ఈ సినిమాకు రిలీజ్ వరకు పెద్దగా బజ్ లేనట్లే కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చెప్పుకోదగిన రేంజ్ లో లేవు. కానీ శనివారం మార్నింగ్ షో ల నుంచి ఈ సినిమాకు బుకింగ్స్ పెరిగాయి. ఇటు సింగిల్ స్క్రీన్స్, అటు మల్టీప్లెక్సులకు జనం బాగానే వచ్చారు. ఈ సినిమాకు కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. మొత్తానికి థియేటర్లకు పూర్త వైభవం ఓ మోస్తరుగా వచ్చిందనే చెప్పాలి.
అలా అని లవ్ మి సినిమాకు మౌత్ టాక్ ఏమంత గొప్పగా లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కినప్పటికీ స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉంటూ స్లో నెరేషన్ తో ఆడియన్స్ ను కన్ఫ్యూజన్కు గురిచేశాయి. మరో వారం పాటూ ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే లవ్ మి సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్సుంటుంది. మరి ఈ అవకాశాన్ని లవ్ మి ఏ మేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.













