Rolex: రోలెక్స్ కోసం నైజీరియాతో సంప్రదింపులు
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్(LCU) నుంచి ఒక్కొక్కటిగా సినిమాలు రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎల్సియూ నుంచి ఖైదీ(Khaidhi), విక్రమ్(Vikram), లియో(Leo) రిలీజ్ కాగా ఖైదీ2(Khaidhi2), రోలెక్స్(Rolex) పాత్రతోనే ఓ స్పెషల్ సినిమాను కూడా లోకేష్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో లోకేష్(Lokesh) కూలీ(Coolie) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
కూలీ తర్వాత లోకేష్ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఖైదీ-2(Khaidhi2) కానీ రోలెక్స్(Rolex2) కానీ చేస్తాడని ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం లోకేష్ రోలెక్స్ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దాని కోసం లోకేష్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రోలెక్స్ షూటింగ్ కు సంబంధించిన పర్మిషన్స్ కోసం నైజీరియా గవర్నమెంట్ తో చిత్ర నిర్మాతలు టచ్ లోకి వెళ్తున్నారని, రోలెక్స్ కు సంబంధించి మేజర్ షెడ్యూల్స్ కొన్నింటిని అక్కడే షూట్ చేయాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నైజీరియాలో డ్రగ్స్, కొకైన్, హెరాయిన్, గంజాయి లాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే రోలెక్స్ సినిమాను ఆ ప్రాంతంలో షూట్ చేయాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నాడట.













