Lokesh Kanagaraj: హీరోగా లోకేష్ కనగరాజ్?
తమిళంలోని స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా తనకంటూ ప్రత్యేక డిమాండ్ క్రియేట్ చేసుకున్నాడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). ప్రస్తుతం లోకేష్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా కూలీ(Coolie) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కూలీ తర్వాత లోకేష్ పలు సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు.
అంతటి బిజీ డైరెక్టర్ లోకేష్ ఇప్పుడు వెండితెర అరంగేట్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. లోకేష్ హీరోగా మారి ఓ సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ మీడియా వర్గాల్లో తెగ వార్తలొస్తున్నాయి. లోకేష్ హీరోగా, అది కూడా తన స్వీయ దర్శకత్వంలోనే అని అంటున్నారు. నెక్ట్స్ ఇయర్ ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని కూడా అంటున్నారు.
ఆల్రెడీ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లోకేష్, ఇప్పుడు హీరోగా మారితే తన కెరీర్లో కొత్త చాప్టర్ మొదలైనట్టే అవుతుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది లేదు. మరి నిజంగానే లోకేష్ హీరోగా మారుతున్నాడా? హీరోగా మారాక కూడా లోకేష్ తన దర్శకత్వంలో సినిమాలు చేస్తాడా అని ఆయన అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై లోకేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.






