Lokesh Kanagaraj: తుపాకులపై లోకేష్ స్పెషల్ ఇంట్రెస్ట్
ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టముంటుంది. ఆ ఇష్టాన్ని బట్టి తమ సంపాదనను ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కొంత మంది తాము సంపాదించిన దాన్ని బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకొందరు ల్యాండ్, మరికొందరు ఇంకేదైనా బిజినెస్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) మాత్రం తాను సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని తుపాకులపై ఇన్వెస్ట్ చేస్తారట.
ఈ విషయాన్ని స్వయంగా లోకేషే వెల్లడించాడు. తనకు తుపాకులపై ఇన్వెస్ట్ చేయడమంటే ఇష్టమని, అలా గన్స్ పై ఇన్వెస్ట్ చేయడం తనకు ఆనందాన్నిస్తుందని చెప్పిన లోకేష్, తనకు రైఫిల్ షూటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని, తనకు రైఫిల్ క్లబ్ లో మెంబర్షిప్ కూడా ఉందని తెలిపాడు. అలవాటులో భాగంగా ఎప్పుడూ ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ జరుగుతూనే ఉంటుందని లోకేష్ చెప్పాడు.
కాగా లోకేష్ ప్రస్తుతం తాను సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) హీరోగా తెరకెక్కిన కూలీ(Coolie) సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాకు లోకేష్ రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని వస్తున్న వార్తలను కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న కూలీ సినిమాలో నాగార్జున(nagarjuna), ఉపేంద్ర(Upendra), ఆమిర్ ఖాన్(Aamir Khan), శృతి హాసన్(Shruthi Haasan) కీలక పాత్రల్లో నటిస్తుండగా కూలీపై అందరికీ భారీ అంచనాలున్నాయి.






