Lokesh Kanagaraj: కూలీపై లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) హీరోగా తెరకెక్కిన సినిమా కూలీ(Coolie). లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ప్రేక్షకులు కూలీ కోసం ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. లోకేష్- రజినీ కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో కూలీ మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా మారింది.
లోకేష్ కు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడింది. తన పేరిట సినిమాటిక్ యూనివర్స్(LCU) ను క్రియేట్ చేసి అందులో తాను తీసే సినిమాలను లింక్ చేసుకుంటూ వస్తున్న లోకేష్ కూలీ సినిమాను కూడా తన సినిమాటిక్ యూనివర్స్ కు కనెక్ట్ చేశారనే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తుండగా ఈ విషయంపై లోకేష్ కూలీ ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు.
రజినీతో తాను తీసిన కూలీ సినిమా స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ అని, ఇది పూర్తిగా కొత్త సినిమా అని, కూలీకి, తన సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధం లేదని చెప్పిన లోకేష్ కూలీ మూవీని కమల్(Kamal Hassan) చేయలేరని, విక్రమ్(Vikram) మూవీని రజీనీకాంత్ గారు చేయలేరని, ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. లోకేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా కూలీ ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.







