లియోలో కొనసాగనున్న లోకేష్ సినిమాటిక్ యూనివర్స్
లోకేష్ కనగరాజ్ ఇండియన్ సినిమలో మల్టీవర్స్ అనే పదాన్ని బాగా పాపులర్ చేసేశాడు. మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఇలా ఇప్పటివరకు లోకేష్ తీసిన ప్రతీ సినిమా ఇంకో సినిమాతో లింక్ చేసి దాన్ని ఒక యూనివర్స్ గా మార్చాడు. ఈ సినిమాల కథలన్నీ డ్రగ్ మాఫియాతోనే ముడిపడి ఉన్నాయి. ఓ సినిమాలోని క్యారెక్టర్లు మరో సినిమాలో ప్రాధాన్యతను చాటుతుంటాయి.
రీసెంట్గా వచ్చిన విక్రమ్ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ) అనే మాట బాగా హైలైట్ అయింది. లోకేష్ క్రియేట్ చేసిన ఈ మల్టీవర్స్ ట్రెండ్‌ను ఇతర డైరెక్టర్లు కూడా అందిపుచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. పఠాన్ సినిమాలో కూడా ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ ను చూడొచ్చు. ఇక అసలు విషయానికొస్తే లోకేష్ లియో సినిమాలో కూడా తన సినిమాటిక్ యూనివర్స్‌ను కంటిన్యూ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
లియో సినిమా స్టోరీ కూడా డ్రగ్ మాఫియా చుట్టూనే తిరగబోతుందని రీసెంట్గా రిలీజ్ చేసిన నా రెడీ సాంగ్‌ను చూస్తుంటే తెలుస్తోంది. డ్రగ్ మాఫియాకు చెందిన డెన్‌లో ఈ పాట కొనసాగనున్నట్లు అర్థమవుతుంది. విక్రమ్ మూవీ లో కనిపించే దాస్ అండ్ కో లోగోను కూడా ఈ సాంగ్‌లో చూపించారు. అంతేకాదు లోకేష్ తన ప్రతి సినిమాలో చూపించే బిర్యానీ సీన్ ఈ సాంగ్ లో కూడా కనిపించింది. లోకేష్ మార్క్ రౌడీస్, గెటప్స్, కలర్ ఫ్రేమ్స్ అన్నీ ఈ సాంగ్‌లో కూడా ఉన్నాయి. ఈ సాంగ్‌ను చూశాక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను ఇష్టపడే వారు లియో సినిమా విషయంలో చాలా ఎగ్జయింట్ గా ఉన్నారు. లియో అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.













