Lokesh Kanagaraj: కూలీలో ఆ పాత్రకు ముందు అనుకున్నది ఎవరినంటే?

రజినీకాంత్(rajinikanth), లోకేష్ కనగరాజ్(lokesh Kanagaraj) కలయికలో వస్తోన్న మొదటి సినిమా కూలీ(Coolie). మాస్ ఇమేజ్ ఉన్న ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో కూలీపై మంచి హైప్ నెలకొంది. ఆగస్ట్ 14న కూలీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే లోకేష్ కనగరాజ్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
కూలీలో సౌబిన్ షాహిర్(Soubin Shahir) కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజైన మోనికా(monica) అనే స్పెషల్ సాంగ్ లో కూడా అతను కనిపించారు. అయితే లోకేష్ ఆ క్యారెక్టర్ ను ముందుగా రాసుకుంది ఫహాద్ ఫాజిల్(Fahadh faasil) కోసమట. దాని కోసం ఆయన్ను కలిశారట కూడా. కానీ ఫహాద్ తనకున్న కమిట్‌మెంట్స్ వల్ల కూలీ చేయలేకపోయారని లోకేష్ తెలిపారు.
ఆ క్యారెక్టర్ ను ఆరు నెలలకు పైగా డెవలప్ చేసి ఆఖరికి సౌబిన్ షాహిర్ ను తీసుకున్నామని లోకేష్ వెల్లడించారు. ఇప్పటికే రజినీ, ఫహాద్ కలిసి వేట్టయాన్(Vettayan) చేశారు. కూలీ లో కూడా ఫహాద్ నటించి ఉంటే ఆ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉండేది. కానీ కొన్నిసార్లు ఎంత అనుకున్నా కుదరవు. కాగా కూలీలో నాగార్జున(nagrajuna), ఆమిర్ ఖాన్(aamir Khan), ఉపేంద్ర(Upendra), శృతి హాసన్(Shruthi Hassan), పూజా హెగ్డే(Pooja Hegde) కీలక పాత్రల్లో నటించగా అనిరుధ్ రవిచందర్(anirudh Ravichander) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.