Lokesh Kanagaraj: కాలేజ్ డేస్ నుంచే నాగ్ ను ఫాలో అవుతున్నా
రజినీకాంత్(rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రాబోతున్న సినిమా కూలీ(Coolie). ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. దానికి కారణం అందులోని క్యాస్టింగ్. నాగార్జున(Nagarjuna), ఆమిర్ ఖాన్(Aamir Khan), ఉపేంద్ర(Upendra), సౌబిన్ షాహిర్(Soubin Shahir), శృతి హాసన్(Shruthi Hassan) కీలక పాత్రల్లో నటిస్తున్నందున కూలీ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న లోకేష్ కనగరాజ్ నాగార్జున గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగార్జునకు తాను కాలేజ్ డేస్ నుంచే అభిమానినని, రక్షకుడు(Rakshakudu) మూవీ చూసినప్పటి నుంచి ఆయన హెయిర్ స్టైల్ ను ఫాలో అయ్యేవాడినని చెప్పాడు లోకేష్.
దాని కంటే ముందు చూసిన శివ(Siva) మూవీ అంటే కూడా తనకు ఇష్టమని చెప్పిన లోకేష్, కూలీ మూవీ కోసం నాగార్జునను ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని, రజినీని ఒప్పించడం కంటే నాగ్ ను ఒప్పించడమే తనకు కష్టమైందని, ఏడెనిమిది స్టోరీ సిట్టింగ్స్ తర్వాత కూలీ క్లైమాక్స్ చెప్పాక నాగ్ ఒప్పుకున్నారని లోకేష్ తెలిపారు. భారీ అంచనాలతో రాబోతున్న కూలీ సినిమాను సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మించగా అనిరుధ్(Anirudh) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.







