Lokesh Kanagaraj: ఆడియన్స్ కొనే టికెట్‌కే ఎక్కువ వాల్యూ ఇస్తా

ఒక సినిమా బయటకు రావాలంటే దాని వెనుక ఎంతో కష్టపడాలి. అయితే కొన్ని సినిమాలు ముందు ఒకలా అనుకుంటే ఆఖరికి మరోలా మారతాయి. కొందరు డైరెక్టర్లు మాత్రమే తామెలా అనుకున్నారో అలానే సినిమాలు తీయగలరు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా తాము అనుకున్న అవుట్‌పుట్ వచ్చేవరకు కష్టపడుతూ దాని కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతారు.
అలాంటి డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కూడా ఒకడు. లోకేష్ కు సౌత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) హీరోగా కూలీ(Coolie) అనే గ్యాంగ్‌స్టర్ డ్రామా రాబోతుంది. ఆగస్ట్ 14న కూలీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాడు లోకేష్.
అందులో భాగంగానే తనకు బాక్సాఫీస్ వద్ద వచ్చే కలెక్షన్ల కంటే ప్రేక్షకులు తనను నమ్మి టికెట్ కోసం పెట్టే రూ.150 అంటేనే ఎక్కువ విలువ అని, తాను తీసే మూవీ విషయంలో ఎక్కడా రాజీపడనని, దానికి వయొలెన్స్ కూడా మినహాయింపు కాదని, ముందు నుంచి అదే సిద్ధాంతానికి తాను కట్టుబటి ఉన్నట్టు లోకేష్ కనగరాజ్ వెల్లడించాడు.