Aditya Hassan: లిటిల్ హార్ట్స్ నిర్మాత సినిమాకు అంత రేటా?

గతేడాది వచ్చిన 90స్ వెబ్ సిరీస్(90s web series) ఏ రేంజ్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబర్ మౌళి(mouli), శివాజీ(sivaji) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్(aditya hasan) దర్శకత్వం వహించగా ఆ సిరీస్ తో ప్రతీ ఒక్కరికీ మంచి పేరొచ్చింది. ఈ సిరీస్ ను చూసి ఏకంగా ఆదిత్య హాసన్ కు నిర్మాతలు డైరెక్టర్ గా ఛాన్స్ లు కూడా ఇచ్చారు.
అందులో భాగంగానే సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) బ్యానర్ లో ఆదిత్య హాసన్ ఓ సినిమాకు సైన్ చేశారు. ఆనంద్ దేవరకొండ(anand devarakonda) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో మొదలై, సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఆదిత్య హాసన్ ఓ వైపు డైరెక్టర్ గా ఆనంద్ తో సినిమా చేస్తూనే మరోవైపు నిర్మాతగా లిటిల్ హార్ట్స్(little hearts) సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.
లిటిల్ హార్ట్స్ తో నిర్మాతగా గా కూడా ఆదిత్య హాసన్ సక్సెస్ అవడంతో ఆనంద్ తో చేస్తున్న సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఇంకా షూటింగ్ పూర్తవకుండా చాలా ముందుగానే ఓటీటీ డీల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. రూ.11 కోట్ల భారీ రేటుకు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆనంద్ సినిమాకు ఈ రేంజ్ రేటు అంటే చాలా మంచి ధరనే చెప్పాలి.