లియో విషయంలో అవన్నీ టైమ్ వేస్ట్ ముచ్చట్లే!
దసరాకు రిలీజ్ అవుతున్న భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు పోటీగా లియో సినిమా కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు రైట్స్ కొన్న సితార సంస్థ చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తోందట. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గెస్ట్ లుగా ఎవరిని పిలవాలనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ అసలు హీరో విజయ్ రాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అతన్ని పొగడితే తెలుగు పరిశ్రమను కాదని తమిళ సినిమాను ఎంకరేజ్ చేసినట్లుందని భావించడం, సదరు హీరో ఫ్యాన్స్ కూడా నిరాశ పడతారని ఆ ప్లాన్ ను పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఈ ఈవెంట్ లో అనిరుధ్ తో లైవ్ పెర్ఫార్మెన్స్ చేయించి సినిమాపై అంచనాలను పెంచాలని ట్రై చేస్తున్నారట. డైరెక్టర్ లోకేష్, హీరోయిన్ త్రిష తో పాటూ లియో టీమ్ మొత్తాన్ని ఈ ఈవెంట్ లో చూడొచ్చు. కానీ విజయ్ మాత్రం రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ మధ్య చెన్నై లో ప్లాన్ చేసిన ఈవెంట్ ను క్యాన్సిల్ చేసిన విజయ్, ఇప్పుడు పక్క రాష్ట్రంలో వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తే తమ తమిళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారని భావించి నో చెప్పాడట విజయ్. ఇది కేవలం రీజన్ మాత్రమే విజయ్ పక్క రాష్ట్రంలో ఎప్పుడూ సినిమాను ప్రమోట్ చేసింది లేదు. వారసుడు టైమ్ లో దిల్ రాజు ఎంత ట్రై చేసినా మీడియాకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇప్పించలేకపోయాడు. కాబట్టి ఈ ఈవెంట్ ఉంటుందని ఆశించడం కూడా టైమ్ వేస్టే. అక్టోబర్ 19న లియో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నీ బాగుంటే రిలీజ్ తర్వాత గ్రాండ్ ప్రెస్ మీట్ పెడితే సరిపోతుంది అని నాగవంశీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.













