ఆ విషయంలో డిఫరెంట్గా ఆలోచించిన లియో టీమ్
ఈ ఇయర్ రానున్న సినిమాల్లో బాగా ఇంట్రెస్ట్ కలిగిస్తున్న సినిమాల్లో ఒకటి లియో. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు లియోలో సంజయ్ దత్, అర్జున్ లాంటి నటులు కూడా కీ రోల్స్ చూస్తుండటంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.
తమిళంలో అయితే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉండగా, తెలుగులో కూడా ఇప్పుడు మంచి హైపే క్రియేట్ అయింది. డ్రగ్ మాఫియా చుట్టూ కథలు అల్లుతూ, తన ఒక సినిమాతో మరో సినిమాకు లింక్ పెట్టే లోకేష్ ఈ సినిమాకు, విక్రమ్ సినిమాకు ఎలా లింక్ చేశాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లియో సినిమా చాలా రకాలుగా క్యూరియాసిటీని పెంచుతుండగా, సినిమా పోస్టర్లు కూడా ఒక కాన్సెప్ట్ ప్రకారం రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్నాళ్ల కిందట కీప్ కామ్, అవాయిడ్ ద బ్యాటిల్ అనే క్యాప్షన్ తో పోస్టర్ వదలగా, అందులో విజయ్ చాలా కూల్ గా ఉన్నాడు. తర్వాత కీప్ కాపమ్, ప్లాట్ యువర్ ఎస్కేప్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్లో విజయ్ తీవ్రంగా ఆలోచిస్తూ కనిపించాడు.
ఇక రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్ లో కీప్ కామ్ రెడీ ఫర్ ద బ్యాటిల్ అంటూ ఫైర్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ ని చూపిస్తూ గన్ తో ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ అన్నింటిని చూసుకుంటే సినిమా కథేంటో అర్థమవుతుంది. ఏదేమైన ఇలా ఓ కాన్సెప్ట్ తో పోస్టర్లను రిలీజ్ చేయడంలో లియో టీమ్ డిఫరెంట్గా ఆలోచించింది.













