లియో నిర్మాత మనసు మార్చుకుంటాడా?
కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి హీరోగా వస్తున్న తాజా సినిమా లియో. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా గురించి నిర్మాత లలీత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
లియో సినిమాను మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మధ్య మల్టీప్లెక్స్ ల నుంచే ఎక్కువ కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో నిర్మాత ఇలాంటి ప్రకటన ఎలా చేశారని కొంతమంది అంటున్నారు. అంతేకాక నార్త్ లో ఎక్కువగా మల్టీప్లెక్స్ లోనే సినిమాలు చూస్తారు.
అలాంటి వారు లియో సినిమాను మిస్ అయ్యే ఛాన్సుంది. ఫలితంగా ఆ ఎఫెక్ట్ కలెక్షన్ల మీద కూడా పడుతుంది. అందుకే నిర్మాత ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి లలీత్ తీసుకున్న ఈ నిర్ణయం లియోకు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా లేక తన డెసిషన్ ను మార్చుకుంటాడా అనేది వేచి చూడాలి. కాగా రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన లియోపై అందరికీ చాలా అంచనాలున్నాయి.













