నానాటికీ పెరుగుతున్న విజయ్ క్రేజ్
తమిళ హీరోల్లో చాలా మందికి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, ధనుష్ ఇలా చాలా మంది తమ మార్కెట్‌ను టాలీవుడ్ లో క్రియేట్ చేసున్న టైమ్ లో స్టార్ హీరో విజయ్ కు మాత్రం ఇక్కడ అసలు గుర్తింపు ఉండేది కాదు. విజయ్ డబ్బింగ్ సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతుందంటే మినిమం క్రేజ్ ఉండేది కాదు.
కానీ గత పదేళ్లలో విజయ్ సినిమాలపై తెలుగు ఆడియన్స్ దృష్టి మారింది. మిగిలిన తమిళ హీరోల మార్కెట్ ఇక్కడ పడిపోతున్న నేపథ్యంలో విజయ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. తుపాకి, జిల్లా లాంటి సినిమాలు మంచి సక్సెస్ ను అందుకుని తనకు పునాదిని వేశాయి. దానికి తగ్గట్టుగానే విజయ్ సినిమాలు తెలుగులో బిజినెస్ చేస్తున్నాయి.
కొన్నేళ్ల నుంచి విజయ్ ప్రతి సినిమా తక్కువలో తక్కువ రూ.10 కోట్లు బిజినెస్ చేస్తోంది. ఇప్పుడు ఆ లెక్కలు రూ.15 కోట్లు దాటి పోయాయి. టాక్ తో సంబంధం లేకుండా విజయ్ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించడంతో పాటూ బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి. గత పదేళ్లలో తెలుగులో ఎక్కువ బ్రేక్ ఈవెన్ సినిమాలున్న హీరో విజయే కావడం విశేషం. తాజాగా వచ్చిన లియో సినిమా కూడా డివైడ్ టాక్‌ను తట్టుకుని సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచిందంటే దాన్ని బట్టి విజయ్ క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.













