వింటేజ్ బాలయ్యను చూపించనున్న బాబీ
హ్యాట్రిక్ హిట్లతో మంచి జోష్ లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బంధిపోటు దొంగల బ్యాక్ డ్రాప్లో చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. 80వ దశకంలో కథను మొదలుపెట్టి మెల్లిగా రివెంజ్ డ్రామాగా సినిమాను మలచనున్నట్లు సమాచారం.
దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కు బాలయ్య పాత్రను లింక్ చేసే ఎపిసోడ్ ను బాబీ చాలా అద్భుతంగా డిజైన్ చేశాడట. ఇంకా చెప్పాలంటే షోలో సినిమాలో గబ్బర్ సింగ్ ను అమితాబ్, ధర్మేంద్ర కాకుండా బాలయ్య ఒక్కడే ఎదుర్కొంటే ఎలా ఉంటుందో ఆ విధంగా దీన్ని బాబీ డిజైన్ చేశాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదు.
ఇదంతా చూస్తుంటే ఈ సినిమాలో బాబీ, బాలయ్యను వింటేజ్ లుక్ లో చూపించబోతున్నట్లు అనిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కుదరకపోతే సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మరి ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి లుక్స్ లో కనిపిస్తాడో, ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.













