లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో గాన కచేరి
ప్రముఖ సినీ నేపథ్య గాయని దివంగత లతా మంగేష్కర్ స్మత్యర్థం లతా మంగేష్కర్ బాలీవుడ్ లెజెండ్ శీర్షికతో ప్రోమ్ 18 పేరిట ప్రత్యేక గాన కచేరిని లండన్లోని రాయల్ అల్బర్ట్ హాల్లో నిర్వహించారు. లతా మంగేష్కర్ తన మధుర స్వరంతో ఇదే రాయల్ ఆల్బర్ట్ హాల్లో 1974లో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన తర్వాత ఆమెకు నివాళిగా కచేరి జరగడం విశేషం. ఈ సందర్భంగా సిటీ ఆఫ్ బర్మింగ్హోమ్ సంఫనీ ఆర్కెస్ట్రా (సీబీఎస్వో) సహకారంతో గాయకులు ఆయే మేరే వతన్ కే లోగో, ఆయేగా ఆనే వాలా లాంటి ప్రజాదరణ పొందిన సినీ గీతాలను ఆలపించారు.













