లతా మంగేష్కర్‌కు అరుదైన గౌరవం
పండిత, పామరులను మెప్పించిన గాత్రం ఆమె సొంతం. దేశాధినేతలను అభిమానులుగా చేసుకున్న స్వర ప్రతిభ ఆ గాయనిది. మెలొడీ క్వీన్‌గా పేరొందిన ఒకే ఒక పాటల నాయకి ఆమె. తానే లతా మంగేష్కర్. దశాబ్ధాలుగా దేశీయ శ్రోతలను అలరిస్తోంది లతాజీ. ఆమెకు త్వరలో భారత ప్రభుత్వం డాటర్ ఆఫ్ ది నేషన్ అనే బిరుదు ఇవ్వబోతోంది. ఈ గౌరవం దక్కించుకున్న తొలి గాయనిగా లతా మంగేష్కర్ చరిత్రకెక్కనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లతా పాటలకు అభిమాని. ఆయన చొరవతోనే ఈ గాయనికి జాతి ముద్దు బిడ్డ అనే పేరు ఇవ్వబోతున్నారు. ఈ నెల 28న లతా మంగేష్కర్ 90వ పుట్టినరోజు. ఈ సందర్భంగా డాటర్ ఆఫ్ ది నేషన్ పురస్కారం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తరపున వెల్లడించిన వ్యక్తి మాట్లాడుతూ మోదీ గారు లతా మంగేష్కర్ స్వరానికి పెద్ద అభిమాని. భారతీయ గొంతుల సమ్మేళనానికి ఆమె స్వరం ప్రతీక. ఆమె 90 వ పట్టిన రోజున డాటర్ ఆఫ్ ది నేషన్ అనే బిరుదును ఇవ్వబోతున్నాం అని తెలిపారు.













