పుకార్లను ప్రచారం చేయవద్దు ఆమె ఇంకా ICUలో వున్నారు! : డాక్టర్ ప్రతిత్ నందాని
సుప్రసిద్ధ గాయకురాలు లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు. లతా దీదీ ఇంకా ఐసీయూలోనే వున్నారు . డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దు. లతా మంగేష్కర్ కుటుంబానికి, వైద్యులకు ప్రైవసీ ఇవ్వండి అంటూ ప్రకనటలో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు.













