Laila: మెగాస్టార్ ను రంగంలోకి దించుతున్న విశ్వక్
విశ్వక్ సేన్(Viswaksen) హీరోగా రామ్ నారాయణ్(Ram Narayan) దర్శకత్వంలో రూపొందిన సినిమా లైలా(Laila). షైన్ స్క్రీన్స్ బ్యానర్(Shine Screens Banner) లో నిర్మాత సాహు గారపాటి(Sahu Garapati) ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.
రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న లైలా 135 నిమిషాల నిడివితో సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఈ మూవీలో మొదటిసారి లేడీ గెటప్ లో కనిపించి సరికొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయ్యాడు. ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో లైలా చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది.
అందులో భాగంగానే ఫిబ్రవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రానున్నారు. ఇవాళ జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొన్నటివరకు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను తన సినిమా ఈవెంట్లకు తీసుకొచ్చి సినిమాను ప్రమోట్ చేసుకున్న విశ్వక్, ఇప్పుడు లైలా కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించుతున్నాడని, సీనియర్ హీరోలను కన్విన్స్ చేయడంలో నీ తర్వాతే ఎవరైనా అని విశ్వక్ ను అభినందిస్తున్నారు.













