Kushi Kapoor: అక్క పెళ్లిపై ఖుషి కపూర్ స్పందన
శ్రీదేవి(Sridevi) కూతుళ్లు జాన్వీ కపూర్(Jhanvi Kapoor), ఖుషి కపూర్(Kushi Kapoor) ఇప్పటికే సినీ రంగ ప్రవేశం చేశారు. శ్రీదేవి లానే తన కూతుళ్లకు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి. అందుకే ఎప్పుడు ఖాళీ దొరికినా అక్కా చెల్లెళ్లు తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా జాన్వీ తన పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
పెళ్లి చేసుకుని భర్తకు సేవ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ రోజూ గోవింద నామం వింటూ తిరుపతిలోనూ ఉండిపోవాలనుందని జాన్వీ చెప్పింది. జాన్వీ చేసిన ఆ కామెంట్స్ పై రీసెంట్ గా జాన్వీ చెల్లి ఖుషీ కపూర్ రెస్పాండ్ అయింది. తను నటించిన లవ్ యాపా ప్రమోషన్స్ లో భాగంగా ఖుషి కపూర్ తన పెళ్లి గురించి, తన అక్కడ జాన్వీ పెళ్లిపై చేసిన కామెంట్స్ పై స్పందించింది.
తనకు గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనున్నట్టు చెప్పిన ఖుషి, అక్కలానే తన పెళ్లి కూడా తిరుపతిలో చేసుకోవాలనుందని, పెళ్లయ్యాక తన తండ్రి బోనీ కపూర్ కూడా తమతోనే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే తన అక్క లాగా భర్తకు సేవలు మాత్రం చేయనని, చిన్నప్పటి నుంచి తనకు పెళ్లి పట్ల ఎంతో గౌరవముందని ఖుషి తెలిపింది. ఇదిలా ఉంటే తను నటించిన లవ్ యాపా(Love Yaapa) సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.













