నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు.. 8వ ఏట నుంచే తనపై
తన 8వ ఏట నుంచే కన్నతండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15వ ఏట తాను తిరగబడితే ఇంటి నుంచి పారిపోయాడన్నారు. అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, చిన్నవయసులో లైంగిక వేధింపులకు గురైతే వారి జీవితాంతం అవి చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయన్నారు. తండ్రిని ఎదుర్కోవడం కంటే ఎన్ని చిత్రహింసలు పెట్టినా పతియే ప్రత్యక్ష దైవమని భావించే తల్లికి లైంగిక వేధింపుల గురించి చెబితే నమ్ముతుందో లేదోనన్నో భయమే తనకు ఎక్కువ ఉండేదని వాపోయారు. ఆ భయంతోనే వేధింపులను ఎనిమిదేళ్ల పాటు మౌనంగా భరించానని తెలిపారు. తండ్రి ఇల్లు విడిచి పారిపోవడంతో తల్లి, తాను పూటకు పట్టెడన్నం కూడా లభించక అష్టకష్టాలు పడ్డామని తెలిపారు.













