వారు సేఫయ్యారా? మిస్సయ్యారా?
యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లో ఓ భారీ చిత్రం చేయడానికి కొన్నేళ్ల ముందు ఎన్నో పెద్ద పెద్ద ప్లాన్స్ వేశాడు. లిరిక్ రైటర్ కమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య డైరెక్షన్లో పవర్ పేట అనే టైటిల్ తో సినిమా చేద్దామని అనౌన్స్ కూడా చేసేశారు. రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాను తెరకెక్కించాలనేది కృష్ణ చైతన్య కోరిక. ఈ సినిమాను రెండు లేదా మూడు పార్టులుగా తీయాలని ప్లాన్ లు కూడా వేసుకున్నారు.
పవర్ పేట తన కెరీర్లోనే మంచి సినిమా అవుతుందని, ఇప్పటి వరకు తను పడని కష్టం, పెట్టని ఖర్చు, పవర్ పేటకు పెట్టబోతున్నట్లు కూడా నితిన్ చెప్పాడు. డిఫరెంట్ లుక్స్ తో, రకరకాల వయసుల్లో తాను ఈ మూవీలో కనిపిస్తానని, నటుడిగా ఆ సినిమా తనను మరో మెట్టు ఎక్కిస్తుందని బాగానే హైప్ ఇచ్చాడు. కానీ ఎందుకో కానీ అనుకోకుండా ఈ సినిమా షెల్వ్ అయింది.
దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని కృష్ణ చైతన్య ఇదే కథను శర్వానంద్ కు చెప్పి ఒప్పించి, సినిమాను అనౌన్స్ చేయించుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా కొన్ని కారణాల వల్ల సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇలా ఇద్దరు హీరోలు చేయకుండా వదిలేసుకున్న ప్రాజెక్ట్‌ని విశ్వక్ సేన్‌కు చెప్పి ఒప్పించి, ఈ సారి పెద్ద బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాను అనౌన్స్ చేయించాడు కృష్ణ చైతన్య.
రీసెంట్గా సినిమా ముహూర్తం షాట్ తో ప్రారంభమైంది కూడా. ఈ సినిమాలో విశ్వక్ ఎలా రగ్డ్ లుక్ లో కనిపించనున్నాడో అలానే ముహూర్త వేడుకకు వచ్చాడు. అంజలి ఈ సినిమాలో విశ్వక్ కు జోడీగా నటిస్తోంది. ఇద్దరు హీరోలు వదిలించుకున్న ఈ సినిమాను కృష్ణ చైతన్యతో తీయబోతున్నాడు. మరి వారు ఈసినిమాను మిస్ అయ్యేందుకు బాధ పడేలా ఈ సినిమాను తెరకెక్కిస్తాడా లేక హమ్మయ్యా సేఫ్ అయ్యాం అనేలా తీస్తాడా అనేది చూడాలి.













