పవన్ కల్యాణ్ కొత్త చిత్రం ప్రారంభం
ఇటీవలే పింక్ రీమేక్‌ను పట్టాలెక్కించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎ.ఎం. రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం రుపుదిద్దుకుంటోంది. పవన్ కల్యాన్ కథనాయకుడు. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఔరంగజేబు పరిపాలనా కాలం నాటి కథ ఇది. పవన్ పాత్ర రాబిన్‌హుడ్‌ని పోలి ఉంటుందట. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా కోసం కొన్ని సెట్స్‌ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు నాయికలు ఉంటారని, ఒకరిని బాలీవుడ్ నుంచి తీసుకొస్తారని సమచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.













