Koratala Siva: నందమూరి బాలయ్యతో కొరటాల సినిమా?

కొందరు డైరెక్టర్లకు హిట్ పడినా తర్వాత ఖాళీగా ఉండక తప్పని పరిస్థితులు ఎదురవుతుంటాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) కూడా ప్రస్తుతం అలాంటి సిట్యేయేషన్స్‌లోనే ఉన్నాడు. ఆయన దర్శకత్వంలో ఆఖరిగా వచ్చిన దేవర(Devara) సినిమా సూపర్ హిట్ గా నిలిచినప్పటికీ కొరటాల ఖాళీగానే ఉన్నారు. దేవర2(devara2) చేద్దామంటే తారక్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prasanth Neel) తో డ్రాగన్(dragon) చేస్తున్న తారక్, ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్(trivikram), నెల్సన్(Nelson) తో సినిమాలు చేయనున్నాడు. అవన్నీ పూర్తయ్యాకే దేవర2 సెట్స్ పైకి వెళ్తుందని టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకే కొరటాల కూడా ఆ గ్యాప్ లో మరో సినిమా చేద్దామని ఫిక్సైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మధ్యలో నాగచైతన్య(Naga Chaitanya) పేరు వినిపించగా ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు వినిపిస్తోంది.
ఆ హీరో మరెవరో కాదు. నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). కొరటాల త్వరలోనే బాలయ్యతో కలిసి వర్క్ చేసే అవకాశాలున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ కలవబోతున్నారని, బాలయ్యను కలిసి కొరటాల స్టోరీ డిస్కషన్స్ చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం అఖండ2(akhanda2) తో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తో ఓ సినిమాను లైన్ లో పెట్టారు. మరి బాలయ్యను కొరటాల కలుస్తుంది అతని సినిమా కోసమేనా? లేక మోక్షజ్ఞ(mokshagna) హీరోగా సినిమా చేయడానికా అనేది తెలియాల్సి ఉంది.