Kishkindhapuri: ఓటీటీలోకి వచ్చేసిన కిష్కింధపురి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(bellamkonda sai sreenivas) హీరోగా అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) హీరోయిన్ గా శాండీ మాస్టర్(sandy master) కీలక పాత్రలో వచ్చిన సినిమా కిష్కింధపురి. హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన కిష్కింధపురి(kishkindhapuri) సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను తెచ్చుకుంది. టాక్ అయితే బాగా వచ్చింది కానీ దానికి తగ్గ కలెక్షన్లను మాత్రం సినిమా అందుకోలేక పోయింది.
అలా అని కిష్కింధపురి ఫ్లాప్ సినిమా కాదు. కమర్షియల్ గా కూడా వర్కవుట్ అయింది కానీ కంటెంట్ కు తగ్గ రీతిలో కలెక్షన్లు మాత్రం రాలేదు. కౌశిక్ పెగళ్లపాటి(kowshik pegallapati) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో చూసిన ఆడియన్స్ కు మంచి అనుభూతినిచ్చింది. అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. జీ5(Zee5)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
కిష్కింధపురి డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దీపావళి వీకెండ్ కు ఓటీటీలోకి రావడంతో కిష్కింధపురికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే వీలుంది. షైన్ స్క్రీన్స్(shine screens) బ్యానర్ లో సాహు గారపాటి(sahu garapati) ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.