K-RAMP: “K-ర్యాంప్” మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘టిక్కల్ టిక్కల్..’ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘టిక్కల్ టిక్కల్..’ విడుదల చేశారు.
చేతన్ భరద్వాజ్ ఎనర్జిటిక్ ట్యూన్ తో కంపోజ్ చేసిన ‘టిక్కల్ టిక్కల్..’ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ రాశారు. సాయి చరణ్ భాస్కరుని పాడారు. ‘టిక్కల్ టిక్కల్..’ పాట ఎలా ఉందో చూస్తే..’టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్.. కలిసి వచ్చే కాలం ముందు నువ్వు సూపర్ రా.. టైమ్ కాస్త బ్యాడ్ అయితే కె ర్యాంప్ రా..ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా, ఫ్లవర్ కాస్త ఫైర్ అయితే కె ర్యాంప్ రా, ఒక్క పెగ్ కిక్కు ఇస్తే నువ్వు సూపర్ రా, ఫుల్ కొట్టినా పిచ్చి పడితే కె ర్యాంప్ రా..’ అంటూ లవర్, లైఫ్ మధ్య హీరో ఎలా నలిగిపోయాడో చూపిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.