Kiran Abbavaram: నా కంటే టాలెంటెడ్ చాలా మందే ఉన్నారు: కిరణ్
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన దిల్ రూబా(Dil Ruba) మూవీ మార్చి 14న రిలీజ్ కానుంది. విశ్వ కరుణ్(viswa karun) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్సార్(Ruksar Thillon) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం కృష్ణ నగర్ లో ఉండే సినిమా పిచ్చోళ్ల గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో ఛాన్సులు రావడం కష్టమని చెప్పిన ఆయన, ఆర్థిక ఇబ్బందుల్ల వల్ల ఎంతోమంది వెనక్కి వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు.
తాను కృష్ణ నగర్ కు వచ్చిన మొదట్లో 50 మందితో ఓ గ్రూప్ ఉండేదని, ఆ 50 మందిలో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో లేరని దానికి కారణం ఆర్థిక ఇబ్బందులేనని చెప్పిన కిరణ్, సినిమాపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పది మందిని తాను ఆర్థికంగా ఆదుకుంటానని కిరణ్ వెల్లడించారు.
ప్రతీ ఏడాదీ 10 మందికి హెల్ప్ చేస్తానని చెప్తున్న కిరణ్, భవిష్యత్తులో తాను ఎదిగితే వంద మందికైనా సాయం చేయడానికి తాను రెడీ అని, బయట తనకంటే టాలెంట్ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారని, లక్ వల్ల తనకు ఛాన్సులొచ్చి గుర్తింపు దక్కిందని, కష్టపడితే ఎవరైనా సక్సెస్ అవుతామని కిరణ్ ఈ సందర్భంగా తెలిపారు. సినిమాలపై ప్రేమ ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకుంటానన్న కిరణ్ మంచి మనసుని అందరూ తెగ అభినందిస్తున్నారు.













