Kiara Advani: బేబీ బంప్‌తో మెరిసిన కియారా
ఈ ఏడాది గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ నటి కియారా అద్వానీ(Kiara Advani) ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్ అయ్యాక పెద్దగా బయట కనిపించని కియారా తాజాగా సోషల్ మీడియాలో బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రెగ్యులర్ గా స్కిన్ షో ఫోటోలు షేర్ చేసే కియారా ఈసారి బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి కూడా వార్తల్లోకెక్కింది. విభిన్న డ్రెస్ లో కియారా లుక్ అదిరిపోయిందని, అందంతో పాటూ తన ఎక్స్ప్రెషన్స్, బేబీ బంప్ కూడా చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.






