Kiara Advani: కియారాకు భర్త ఖరీదైన కానుక
తెలుగులో పలు సినిమాలు చేసిన కియారా అద్వానీ(Kiara Advani) రీసెంట్ గా గేమ్ ఛేంజర్(game changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో కియారా అద్వానీ పలు సినిమాలు చేసి, మంచి క్రేజ్ అందుకుంది. కియారా తన తోటి బాలీవుడ్ నటుడైన సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరి లో గుడ్ న్యూస్ చెప్పారు.
తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అందరికీ తెలుపుతూ కియారా ఇన్స్టా లో పోస్ట్ ద్వారా తెలిపింది. అయితే తాజాగా చెకప్స్ లో భాగంగా కియారా అద్వానీ ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు రాగా, ఈ సారి ఆ జంట వచ్చిన కారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కియారా, సిద్ధార్థ్ ఈసారి ఓ కొత్త కారులో వచ్చారు. ఆ కొత్త కారు టొయాటో(Toyoto) కంపెనీకి చెందిన వెల్ఫైర్ అనే మోడల్ది.
సుమారు రూ.1.22 కోట్ల విలువైన ఈ కారును సిద్ధార్థ్, కియారాకు గిఫ్టుగా ఇచ్చాడట. కియారా ప్రెగ్నెంట్ అనే విషయం తెలియగానే ఆమె కోసం తన భర్త ఈ కారుని కొన్నాడని తెలుస్తోంది. మిగిలిన కార్ల కంటే ఈ కారు చాలా లగ్జరీగా ఉంటుందని, లోపల స్పేస్ తో పాటూ అన్ని సౌకర్యాలు ఉంటాయని, అందుకే తన భార్యకు సిద్ధార్థ్ ఈ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడని అంటున్నారు.






