Kethika Sharma: పుష్ప ఐటెం సాంగ్ మిస్ అయిన కేతిక
కేతిక శర్మ(Kethika Sharma) చేయాల్సిన ఓ స్పెషల్ సాంగ్ ను సమంత(Samantha) చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నితిన్(Nithin) హీరోగా వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్హుడ్(Robinhood) సినిమా మార్చి 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేతిక శర్మ అదిదా సర్ప్రైజు(Adhidha SurpriseU) అనే ఐటెం సాంగ్ చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ తన ఆనందాన్ని తెలుపుతూ కేతిక పుష్ప మూవీలోనే ఐటెం సాంగ్ చేయాల్సిందనే విషయాన్ని వెల్లడించాడు. పుష్ప(Pushpa) లో ఐటెం సాంగ్ కోసం సమంత(Samantha) కంటే ముందే కేతికను అనుకున్నామని, కానీ అప్పుడది కుదరలేదని, మళ్లీ ఇన్నేళ్లకు కేతిక తో పని చేసే అవకాశం దక్కిందని రవి శంకర్(Ravi Shankar) అన్నారు.
ఒకవేళ అన్నీ బావుండి కేతిక అప్పుడే పుష్ప సినిమాలో ఊ అంటారా పాట చేసి ఉంటే ఇవాళ తన స్థాయి వేరేలా ఉండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే అంటారు దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి సమంత అందుకున్న పాపులారిటీ మామూలుది కాదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.













