రజనీ కూతురుగా కీర్తీ ?
రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్భూ, మీనా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారని తెలిసింది. ఖుష్బూ ఈ సినిమా సెట్లో జాయినయ్యారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత రజనీ, ఖుష్బూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమాలో రజనీ కూతురి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారని, ఆల్రెడీ ఆమె షూటింగ్లో పాల్గొంటున్నారన్నది తాజా సమాచారం. అలాగే ఈ సినిమాలో రజనీ రెండు పాత్రలు చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ప్రకాశ్‌రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.













