Keerthy Suresh: బాలీవుడ్ ఎంట్రీ నాకు కొత్త చాప్టర్

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన కీర్తి సురేష్(keerthy suresh) ఇప్పుడు కెరీర్లో కాస్త నెమ్మదించింది. ఒకప్పుడు ఖాళీ లేకుండా పలు భాషల్లో సినిమాలు చేసిన కీర్తి కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆంటోనీని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నా సినిమాల్లో కొనసాగుతా అని కీర్తి చెప్పినప్పటికీ, ఆ తర్వాత కొత్త సినిమా సైన్ చేయడానికి కీర్తి చాలా సమయమే తీసుకుంది.
గతంలో లాగా వరుస పెట్టి సినిమాలు చేయడం లేదు. మొన్నీమధ్యే మిస్కిన్(Myskkin) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానంటూ ఓ సినిమాను అనౌన్స్ చేసింది కీర్తి. అయితే ఒకప్పటిలా కీర్తి సినిమాలను లైన్ లో పెట్టకపోవడంతో అమ్మడికి ఛాన్సులు రావడం లేదా? వచ్చినా తానే ఒప్పుకోవడం లేదా అనే ప్రశ్నలు అందరికీ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడింది.
సినీ ఇండస్ట్రీలో తానింకా చాలా జర్నీ చేయాల్సి ఉందని, అందుకే తొందరపడి సినిమాలను ఒప్పుకోవడం లేదని, అన్నీ ఆలోచించి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నానని, బాలీవుడ్ లో చేసిన బేబీ జాన్(baby john) తన కెరీర్ కు కొత్త చాప్టర్ అని, బాలీవుడ్ కు వెళ్లడానికి కారణం ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేస్తూ, కొత్త కథల్లో భాగమవడానికేనని, ప్రస్తుతం ఈ జర్నీని తాను ఆస్వాదిస్తున్నట్టు కీర్తి చెప్పింది.