Keerthy Suresh: అక్క లుక్ లో షాకిచ్చిన కీర్తి సురేష్
కెరీర్ స్టార్టింగ్ లో క్యూట్ గా చాలా సైలెంట్ గా కనిపించిన కీర్తి సురేష్(Keerthy Suresh) రీసెంట్ గా బాలీవుడ్ కు వెళ్లాక తన పంథానే మార్చేసింది. అప్పటివరకు గ్లామర్ షో చేయని కీర్తి, అక్కడికి వెళ్లాక బాలీవుడ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఎక్స్పోజ్ చేస్తూ గ్లామర్ షో చేయడం స్టార్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కీర్తి మరోసారి ఆడియన్స్ కు షాకిచ్చింది.
ప్రస్తుతం కీర్తి నెట్ ఫ్లిక్స్(Netflix) కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. దానికి సంబంధించిన క్లూ ఎక్కడా, ఎప్పుడూ చెప్పింది లేదు. నెట్ ఫ్లిక్స్ తాజాగా తమ నుంచి రాబోతున్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వగా అందులో కీర్తి సురేష్ చేస్తున్న అక్క(AKKA) ప్రాజెక్టు కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది.
ఆ గ్లింప్స్ లో కీర్తిని చూసి ఎవరైనా షాక్ అవ్వడం ఖాయం. ధర్మరాజ్ శెట్టి(Dharma Raj Shetty) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్లో కీర్తి లుక్స్, నడవడిక అన్నీ చాలా కొత్తగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో రాధికా ఆప్టే(Radhika Apte) కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు లాస్ట్ లో చూపించారు. చూస్తుంటే అక్క సిరీస్ లేడీ గ్యాంగ్స్టర్ డ్రామాగా అనిపిస్తోంది. బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కీర్తికి ఆ సినిమా నిరాశే మిగిల్చింది. మరి అక్క అయినా తనను అక్కడ నిలబడేలా చేస్తుందేమో చూడాలి.













