కీర్తి సురేష్ కు అరుదైన అవకాశం
ఒకే ఒక్క సినిమా తారల జీవితాల్నే మార్చేస్తుంటుంది. అలా మహానటి సినిమా కీర్తి సురేష్ కెరీర్‌నే పూర్తిగా మలుపు తిప్పింది. స్టార్ హీరోయిన్ జాబితాలో చేరడమే కాదు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకూ కేరాఫ్‌గా నిలబడేలా చేసింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో పలు భారీ ఆఫర్స్ కీర్తిని వరిస్తున్నాయి. తాజాగా చిరంజీవి సరన నటించే అరుదైన అవకాశం కీర్తి దక్కించుకుందట. చిరంజీవి ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో కథానాయికగా కీర్తిసురేష్‌ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. దీని కోసమై దర్శకుడు కొరటాల కీర్తితో ఇప్పటికే చర్చలు కూడా జరిపారట. ఈ సినిమా కోసం గతంలో అనుష్క, శృతి హాసన్, నయనతార పేర్లు వినిపించిన విషయం విదితమే. ఇది ఒకే అయితే కీర్తి జాబితాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్టే.













