Kayadu Lohar: భారీగా రేటుగా పెంచిన డ్రాగన్ భామ

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికెప్పుడు ఎలా ఫేమ్ వస్తుందో చెప్పలేం. కొందరికి ఓవర్ నైట్ లో స్టార్‌డమ్ వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కయ్యదు లోహర్(Kayadu Lohar) ది కూడా ఇదే పరిస్థితి. ముకిల్ పేట్(Mukil Pet) అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన కయ్యదు, ఆ మూవీ మంచి ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత మలయాళంలోకి వెళ్లి అక్కడ ఓ సినిమా చేస్తే అది కూడా ఆశించిన రిజల్ట్ ను అందుకోలేకపోయింది.
అలా పలు భాషల్లో సినిమాలు చేసిన కయ్యదుకు రీసెంట్ గా తమిళంలో చేసిన డ్రాగన్(Dragon) మూవీ మంచి విజయాన్ని అందించింది. దీంతో ఆమె వెంట ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో కయ్యదు తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
డ్రాగన్ సినిమాకు రూ.30 లక్షలే తీసుకున్న కయ్యదుకి ఆ సినిమా హిట్ అవడంతో నిర్మాతలు మరో రూ.70 లక్షలు ఇచ్చారట. అయితే ఇప్పుడు అమ్మడు తన రాబోయే సినిమాలకు ఏకంగా రూ.2 కోట్లు తీసుకుంటుందని సమాచారం. దానికి కారణం కయ్యదు వెంట ధనుష్(dhanush), శింబు(Simbhu) లాంటి స్టార్ హీరోలు పడటమే. అన్నీ అనుకున్నట్టు జరిగి ధనుష్ సినిమా కూడా హిట్ అయితే ఈ రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ ను మరింతపెంచినా ఆశ్చర్యం లేదు.