ఐటెంసాంగ్‌కు కత్రినాకైఫ్ గ్రీన్ సిగ్నల్
చిక్నీ ఛమేలి, షీలా కీ జవానీ లాంటి ప్రత్యేక గీతాల్లో అందాల ప్రదర్శనతో పాటు అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల హృదయాల్ని దోచుకున్నది కత్రినాకైఫ్. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ఈ సుందరి. అలియాభట్ కథానాయికగా నటిస్నుత్న బాలీవుడ్ చిత్రం గంగుబాయి కథియావాడి. హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి నవల ఆధారంగా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వేశ్యగా జీవితాన్ని మొదలుపెట్టి కామటిపుర ప్రాంతానికి చెందిన అధినేతగా ఎదిగిన గంగుబాయి అనే మహిళా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ మహిళా ప్రధాన చిత్రంలో ప్రత్యేక గీతంలో కత్రినాకైఫ్ నటించబోతున్నది. విభిన్నమైన గెటప్‌లో కత్రినాను ఆవిష్కరిస్తూ ఈ పాటను సంజయ్‌లీలా భన్సాలీ చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ అగ్ర కథానాయికలు అలియాభట్, కత్రినాకైఫ్ ఓకే సినిమాలో కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నది.













