Kate Winslet: డైరెక్టర్ గా మారుతున్న హీరోయిన్
పలు దశాబ్దాలుగా ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో చాలా గొప్ప ప్రశంసలు అందుకున్న కేట్ విన్స్లెట్(Kate Winslet) ఇప్పుడు డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తుంది. టైటానిక్ సినిమాలో నటించి మెప్పించిన విన్స్లెట్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్(netflix) డ్రామా గుడ్ బై జూన్(Good bye june) తో డైరెక్టర్ గా మారుతోంది. విన్స్లెట్ కొడుకు జో ఆండర్స్(Joe Anders) రాసిన స్క్రిప్ట్ ఆధారంగా ఈ మూవీ రూపొందింది.
ఇందులో టోనీ కొల్లెట్(Toni kollet), ఆండ్రియా రైస్బరో(Andrea Ricebaro), తిమోతి స్పాల్(Timothi Spall), హెలెన్ మిర్రెన్(hellen mirren), జానీ ఫ్లిన్(johny flin) లాంటి బ్రిటీష్ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తూ భాగమవడంతో గుడ్ బై జూన్ పై మంచి అంచనాలున్నాయి. విన్స్లెట్ కూడా నటిగా ఎలా అయితే ప్రశంసలు అందుకుందో డైరెక్టర్ గా కూడా అలానే సక్సెస్ అవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
పైగా రీసెంట్ గా విన్స్లెట్ కు లీ సినిమాలో యాక్టింగ్ కు గానూ గోల్డెన్ గ్లోబ్ మరియు BAFTA నామినేషన్లలో గెలిచారు. ఈ అంశం కూడా గుడ్ బై జూన్ కు కలిసొచ్చే వీలుంది. కుటుంబ అంతరాయాలను ఎదుర్కొంటున్న తోబుట్టువులు కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ డ్రామాకు మంచి రివ్యూలు వస్తే విన్స్లెట్ నుంచి భవిష్యత్తులో కూడా డైరెక్టర్ గా మరిన్ని సినిమాలొచ్చే వీలుంది. డిసెంబర్ 12న రిలీజ్ కానున్న గుడ్ బై జూన్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.






