Vaa Vaathiyaar: ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్న కార్తీ సినిమా

కోలీవుడ్ హీరో కార్తీ(karthi)కి టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. వరుస సినిమాలతో కార్తీ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అలాంటి కార్తీ కెరీర్ కు ఓ సినిమాతో డైరెక్టర్ బ్రేక్ వేశారు. అతనే నలన్ కుమారస్వామి(nalan kumarswamy). నలన్ దర్శకత్వంలో కార్తీ రెండేళ్ల ముందే సినిమాను అనౌన్స్ చేశాడు కానీ ఇంకా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు.
వా వాతియార్(Vaa Vaathiyaar) టైటిల్ తో నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో కృతి శెట్టి(krithi Shetty) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మధ్యలో ఈ సినిమా అసలు ఆగిపోయిందని కూడా వార్తలొచ్చాయి. దానికి కారణం కార్తీ ఈ మూవీ తర్వాత మొదలుపెట్టిన సర్దార్(sardar), సత్యం సుందరం(Satyam Sundaram) కూడా రిలీజయ్యాయి.
అయితే సమస్యలన్నింటినీ అధిగమించి నలన్ కుమారస్వామి ఈ సినిమాను పూర్తి చేయగా, మేకర్స్ ఈ మూవీ రిలీజ్ గురించి సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ లో వా వాతియార్ రిలీజ్ కాబోతున్నట్టు హింట్ ఇస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచారు మేకర్స్. స్టూడియో గ్రీన్స్ బ్యానర్(Studio green banner) లో రూపొందిన ఈ సినిమా ఈ సారైనా చెప్పిన టైమ్ కు రిలీజవుతుందా అని అందరూ అనుమానపడుతున్నారు.