మరోసారి విజయ్ తో ఆ నిర్మాత?
కొన్ని సినిమాలు అనౌన్స్ చేసినప్పుడు క్రేజీ కాంబోలుగా మార్క్ వేసుకుంటాయి. కానీ వాటి ఫలితాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి వాటిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ- డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా లైగర్. పూరీ కనెక్ట్స్ తో పాటూ కరణ్ జోహార్ కూడా కలిసి ఈ సినిమాను నిర్మించాడు.
ఈ సినిమాపై అందరూ చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ దాని ఫలితం చూశాక అందరూ షాకయ్యారు. లైగర్ తో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటాలనుకున్న విజయ్ కు ఆ సినిమా చాలా నిరాశను మిగిలిస్తే, పూరీని ఆ సినిమా కేసుల వరకు తీసుకెళ్లింది. ఇక నిర్మాతగా చార్మీ అయితే ఈ సినిమా వల్ల చాలా నష్టపోయింది.
ఇన్ని చేదు అనుభవాల్ని ఉంచుకుని కూడా కరణ్ జోహార్, విజయ్ తో మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. విజయ్ తో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తీయాలని ఆలోచనలో ఉన్న కరణ్, దాని కోసం ఇప్పటికే ఓ లవ్ స్టోరీని కూడా రెడీ చేయించాడని, కాకపోతే ఈ సినిమాను ఓ సౌత్ డైరెక్టర్ తో చేయించాలని ఆయన చూస్తున్నాడట. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లతో కరణ్ చర్చలు జరిపినప్పటికీ, ఇంకా ఏ డైరెక్టరూ ఫిక్స్ కాలేదని సమాచారం. విజయ్ స్టామినాను నమ్మి ముందుకొస్తున్న కరణ్ కు ఈసారైనా మంచి ఫలితం దక్కుతుందేమో చూడాలి.













