Karan Johar: అలియాను నెపో కిడ్ అన్నవాళ్లు మూర్ఖులతో సమానం
ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువని అందరూ అంటుంటారు. అయితే బాలీవుడ్ లో ఈ నెపోటిజం స్థాయి మరింత ఎక్కువగా ఉంటుందని కూడా కామెంట్స్ చేస్తుంటారు. నెపోటిజం వల్ల ఎంతోమంది సెలబ్రిటీలు అవకాశాలను కోల్పోయారని మీడియా ముఖంగా బయటకు చెప్పిన సందర్భాలెన్నో ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) నెపోటిజం వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉందని, నెపో కిడ్ వల్లే ఆమెకు అవకాశాలు భారీగా వస్తున్నాయనే కామెంట్స్ పై తాజాగా బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) స్పందించాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ, అలియా ఎన్నో సినిమాల్లో ఎంతో మంచి నటనను కనబరిచిందని చెప్పాడు.
రాజీ(Raji), హైవే(Highway), గంగూబాయి కాఠియావాడి(Gangubhai Katiyawadi) సినిమాల్లో అలియా నటన చాలా బావుంటుందని, ఆ సినిమాలు చూస్తే అలియాను నెపో కిడ్ అనరని, అవి చూశాక కూడా ఆమెను నెపో కిడ్ అంటే వారు తన దృష్టిలో మూర్ఖులేనని, అలాంటి వారిని ప్రపంచంలో ఎవరూ మార్చలేరని, అలియా చాలా ఉత్తమ నటి అని కరణ్ అభిప్రాయపడ్డారు. కరణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






