Kannappa: కన్నప్ప రన్ టైమ్ ఎంతంటే
చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మంచు విష్ణు(manchu vishnu) ఇప్పుడు కన్నప్ప(kannappa) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్తున్న విష్ణు ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేయనున్నాడు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న విష్ణు కన్నప్ప సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే కన్నప్ప సినిమా తాజాగా సెన్సార్ వర్క్స్ ను పూర్తి చేసుకుంది. కన్నప్ప సినిమాకు సెన్సార్ బోర్డు యూ?ఏ సర్టిఫికెట్ ను అందించింది. మొత్తం 195.02 నిమిషాల నిడివితో చిత్ర యూనిట్ కన్నప్పను సెన్సార్ కు పంపగా, అందులో కొన్ని సీన్స్ కు సెన్సార్ అభ్యంతరం తెలిపి 12.11 నిమిషాల సీన్స్ ను కట్ చేశారు. దీంతో ఆఖరిగా కన్నప్ప ఫైనల్ రన్ టైమ్ సుమారు 183 నిమిషాలు అని తెలుస్తోంది.
సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న కన్నప్ప సినిమాపై అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్(mukesh kumar singh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కు ఆల్రెడీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మోహన్ బాబు(mohan babu), మోహన్ లాల్(mohan lal), ప్రభాస్(prabhas), అక్షయ్ కుమార్(akshay kumar), కాజల్(kajal) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.






