కర్ణపై కంగువ ఎఫెక్ట్
కంగువ(Kanguva) డిజాస్టర్ అవడంతో ఆ ఎఫెక్ట్ సూర్య(Suriya) మార్కెట్ పై భారీగా పడింది. రిలీజ్ కు ముందు రూ.2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పిన కంగువ రిలీజ్ తర్వాత మాత్రం బోల్తా పడింది. దీంతో నిర్మాత అన్న మాటలు ట్రోలింగ్ గా మారాయి. ఆఖరికి సూర్య భార్య జ్యోతిక(Jyothika) కంగువకు మద్దతుగా పోస్టు పెడితే దాన్ని కూడా నెటిజన్లు తప్పు బడుతున్నారు.
కంగువ సినిమా ఆడియన్స్ లో బాగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. కనీసం 50% రికవరీ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు కానీ మినిమం కలెక్ట్ చేయకపోవడంతో ఇప్పుడా ఎఫెక్ట్ సూర్య నెక్ట్స్ మూవీ కర్ణ(Karna)పై పడిందని బాలీవుడ్ టాక్. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా(Rakesh Om Prakash Mehra) దర్శకత్వంలో సూర్య హీరోగా రూ.600 కోట్ల బడ్జెట్ తో కర్ణను రూపొందించాలని మేకర్స్ మొదట ప్లాన్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారం అంత పెద్ద బడ్జెట్ వర్కవుట్ అవదని భావించి వీలైనంత బడ్జెట్ ను తగ్గించమని నిర్మాతలు దర్శకుడిని కోరారట. కానీ అలా చేస్తే క్వాలిటీ తగ్గిపోతుందని భావించి దానిపై ఆలోచిస్తున్నారని అంటున్నారు. కంగువ హిట్ అయుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. కానీ ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిజాస్టర్ అవడంతో ఆ ఎఫెక్ట్ కర్ణపై పడింది. మరి ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి.













