కన్నప్పలో మరో బాలీవుడ్ భామ
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్ లాంటి ప్రముఖ నటులు నటించనున్నారు. రీసెంట్ గా కన్నప్ప టీమ్ న్యూజిలాండ్ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతి గా నటిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నయనతార నటించడం లేదని తెలుస్తోంది. నయన్ కు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మరో బాలీవుడ్ నటి చేరినట్లు తెలుస్తోంది. ఆమె ఇంకెవరో కాదు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్. నయనతార డేట్స్ అందుబాటులో లేకపోవడంతో కన్నప్ప మేకర్స్ కంగనాను సంప్రదించారట.
కంగనా కూడా ఆ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో కంగనా తనకు ఓ తెలుగు సినిమాలో పార్వతి దేవి పాత్ర ఆఫర్ వచ్చిందని, మూడు నుంచి నాలుగు రోజుల షూట్ ఉంటుందని చెప్పింది. కంగనా గతంలో చెప్పింది కన్నప్ప గురించేనని ఇప్పుడు నెటిజన్లు అంటున్నారు.













